Tuesday, July 7, 2026
Homeతెలంగాణవన్ టౌన్ పరిధిలోకి చేరిన ఆరవ డివిజన్‌

వన్ టౌన్ పరిధిలోకి చేరిన ఆరవ డివిజన్‌

📰 Generate e-Paper Clip

రామగుండం, జూలై 6 (చైతన్య గళం): జనగామ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న శాంతిభద్రత సమస్యలను పరిష్కరించేందుకు రామగుండం ఆరవ డివిజన్‌ను టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారు. ఇంతకు ముందు గ్రామ ప్రజలు ఫిర్యాదుల కోసం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కృషితో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి జనగామ గ్రామాన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చింది.ఈ నిర్ణయంతో గ్రామ ప్రజలకు పోలీస్ సేవలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి. సమస్య పరిష్కరించినందుకు ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిపెల్లి కృపాకర్ రావు, జనగామ శివ, మాజీ కార్పొరేటర్ జనగామ నరసయ్య, రుద్రభట్ల నారాయణ, మల్లెపల్లి రాజాం, గుండబోయిన మల్లయ్య, మారం వెంకటేష్, భీముని తిరుపతి, భీముని అంకుష్, గుండబోయిన నరసయ్య, కంది మురళి, సంబోదు లక్ష్మయ్య, గుండబోయిన పైడ్రాజు, మేకల సంపత్, జనగామ లింగస్వామి, మేకల రమేష్, బందెల మల్లేష్, సుంకరి నారాయణ, ముడారం నారాయణ, దాకూరి నరసయ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!