నందికొట్కూరు (చైతన్య గళం): నందికొట్కూరు పట్టణంలోని కర్నూల్ రోడ్ బైరెడ్డి నగర్‌కు చెందిన చాకలి సంజన్న (50) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పట్టణ అధ్యక్షుడు మన్సూర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా టౌన్ అధ్యక్షుడు మన్సూర్ మాట్లాడుతూ, “వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలేని సేవలు చేసిన సంజన్న మృతి పార్టీకి తీరని లోటు” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకార్ రెడ్డి, నాయబ్, మార్కెట్ రాజు, కేశవ, వెంకటస్వామి, రమణ అశోక్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
