Wednesday, July 1, 2026
Homeతెలంగాణకరీంనగర్సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఉల్లంపల్లిలో ప్రత్యేక పూజలు

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఉల్లంపల్లిలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

చిగురుమామిడి,జూలై 01(చైతన్యగళం): ఉల్లంపల్లి గ్రామం లో   సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఉల్లంపల్లి గ్రామంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ దేవతల విగ్రహాలకు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి అనుగ్రహంతో చెరువులు, కుంటలు, వాగులు జలకళతో నిండిపోవాలని, రైతుల శ్రమ ఫలించి ప్రతి పొలం పచ్చని పంటలతో కళకళలాడాలని ప్రార్థించారు.

అలాగే గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, పశుసంపద వృద్ధి చెందాలని, పంటలకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉల్లంపల్లి గ్రామ సర్పంచ్ అలువాల శంకర్, ఉపసర్పంచ్ కానవేని  జితేందర్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

“లోకా సమస్తా సుఖినో భవంతు”

“సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్నల శ్రమ ఫలించి, ప్రతి పొలం పచ్చదనంతో కళకళలాడుతూ, ప్రతి ఇంట ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని మనసారా ప్రార్థిద్దాం.”

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!