సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఉల్లంపల్లిలో ప్రత్యేక పూజలు
చిగురుమామిడి,జూలై 01(చైతన్యగళం): ఉల్లంపల్లి గ్రామం లో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఉల్లంపల్లి గ్రామంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ దేవతల విగ్రహాలకు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి అనుగ్రహంతో చెరువులు, కుంటలు, వాగులు జలకళతో నిండిపోవాలని, రైతుల శ్రమ ఫలించి ప్రతి పొలం పచ్చని పంటలతో కళకళలాడాలని ప్రార్థించారు. అలాగే గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రతి కుటుంబం...