Monday, June 29, 2026
Homeతెలంగాణకరీంనగర్వర్షాకాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – జమ్మికుంట 3వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్...

వర్షాకాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – జమ్మికుంట 3వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ దిలీప్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ చైతన్యగళం జూన్ 26  జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డును మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సందర్శించి వర్షాకాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ పరిధిలోని విలీన గ్రామం రామన్నపల్లిలో వరద నీటి సమస్యతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో జేసీబీలతో కచ్చా కాలువల నిర్మాణంతో పాటు ప్రత్యేక డ్రైవ్ ద్వారా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటూ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలకని రాజకుమారి రాజు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!