Tuesday, June 30, 2026
Homeతెలంగాణడోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఎల్ఏల శిక్షణా శిబిరం

డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఎల్ఏల శిక్షణా శిబిరం

📰 Generate e-Paper Clip

డోర్నకల్లా, జూన్ 29 (చైతన్యగళం): డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కురవి మండలంలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏలు) కోసం ఎస్‌ఐఆర్ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై శిక్షణా శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ కోఆర్డినేటర్ ఎం.డి. అవిజ్ హాజరై, బీఎల్ఏల బాధ్యతలు, ఓటరు జాబితా పరిశీలనలో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ, “ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకం. ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.

అలాగే బూత్‌వారీగా అన్‌మ్యాప్డ్ ఓటర్ల జాబితాను పరిశీలించి, ప్రతి ఓటరిని గుర్తించి నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా ఖచ్చితత్వం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వీరభద్రం, మరిపెడ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, ఆలయ చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ ఎర్ర నాగేశ్వరరావు, గార్లపాటి వెంకటరెడ్డి, రాము నాయక్, రవి నాయక్, గొల్లపల్లి రజనీకాంత్, బాలగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!