Tuesday, June 30, 2026
Homeతెలంగాణజూలై 1న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి

జూలై 1న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్, జూన్ 29(చైతన్యగళం): పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారధి పిలుపునిచ్చారు.జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు ఇల్లు లేక అద్దె భారంతో ఇబ్బందులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్థలాలు కేటాయించాలని కోరారు. గుడిసెలను కూల్చివేయడం, నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు.అలాగే జూలై 5–7 తేదీల్లో తొర్రూరులో మూడు రోజుల రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!