ఆరుగురు నిందితుల అరెస్ట్
కరీంనగర్, జూన్ 23 (చైతన్య గళం): కరీంనగర్ గణేష్‌నగర్‌లో జరిగిన *టయోటా ఇనోవా కార్ చోరీ కేసు (సీర్. నం.364/2026)*లో వన్‌టౌన్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
పిర్యాదుదారు కల్లేపల్లి జానీ (48, గర్రెపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి). నిందితులు యెరువా జోజిరెడ్డి, నీర్ల శివకృష్ణ, చెప్యాల రవికుమార్, ఆకుల రాజు కుమార్, కాసా సత్యరాజ్, రాపాక రాకేష్ @ లడ్డు. వీరి వద్ద నుండి ఒక ఇనోవా కారు, రూ.42,000 నగదు, శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్–4 మొబైల్, హెచ్డిఎఫ్సి బ్యాంకు చెక్కులు (20 లక్షలు, 10 లక్షలు), చెక్‌బుక్, కేడీసీసీ బ్యాంక్ పాస్‌బుక్ స్వాధీనం చేశారు.
పూర్తి విచారణలో, జోజిరెడ్డి–జానీ మధ్య భూవివాదాల కారణంగా కారును తిరిగి పొందేందుకు పథకం రచించి, సహచరులతో కలిసి జూన్ 17న గణేష్‌నగర్‌లో పార్క్ చేసిన కారును దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం విజయవాడకు తరలించే ప్రయత్నంలో కరీంనగర్ బైపాస్ వద్ద ఆటోనగర్‌లో వారిని అరెస్ట్ చేశారు.
ఈ కేసు ఛేదనలో వన్‌టౌన్ సీఐ రామచంద్రరావు బృందం విశేష కృషి చేసింది.
