Thursday, August 27, 2026
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లలో ఘనంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

రాజన్న సిరిసిల్లలో ఘనంగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల, జూన్ 23 (చైతన్య గళం):
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, గొప్ప జాతీయవాది, దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ ఏకత్వం, అఖండత కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ఆయన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, సీనియర్ నాయకులు గజ బింకర్ చందు, ఉరవగొండ రాజు, ఎర్రం విజయ్ శేఖర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!