Tuesday, June 23, 2026
Homeతెలంగాణరంగారెడ్డివిద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ పోరాటం

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ పోరాటం

📰 Generate e-Paper Clip

మంచాల, జూన్ 23 (చైతన్యగళం): విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం, విద్యాసంస్థల దృష్టికి తీసుకెళ్లేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం ZPHS లోయపల్లి, చాలెంజ్ ఐసీఎఫ్, శుభోదయం విద్యా మందిర్ పాఠశాలలను బంద్ చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, “విద్యార్థుల హక్కులు, నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కోసం ఎప్పటికప్పుడు ముందుండి పోరాడుతాం. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం. సమస్యలపై రాజీ లేదు” అని స్పష్టం చేశారు.

బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు మద్దతు తెలపడం ద్వారా ఉద్యమానికి మరింత బలం చేకూరిందని నాయకులు పేర్కొన్నారు. విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చెరుకు జగదీష్ గౌడ్, మోర శ్రీకాంత్, బొడ్డుపల్లి ప్రకాష్, ఆంబోత్ రవి నాయక్, కారింగు శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!