ఎల్కతుర్తి, నవంబర్ 25 (చైతన్యగళం):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం క్రాస్ వద్ద జాతీయ రహదారి 563పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూరారం గ్రామానికి చెందిన మేకల కవిత రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
అండర్పాస్ కోసం గతంలో ధర్నా
సూరారం క్రాస్ వద్ద అండర్పాస్ నిర్మించాలని కోరుతూ గ్రామస్థులు గత అక్టోబర్ 6న ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్హెచ్ఏఐ అధికారులు స్థలాన్ని పరిశీలించినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అండర్పాస్ లేకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు రహదారి దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అండర్పాస్ నిర్మాణం చేపట్టి మరిన్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

