సూరారం క్రాస్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ఎల్కతుర్తి, నవంబర్‌ 25 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం క్రాస్‌ వద్ద జాతీయ రహదారి 563పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూరారం గ్రామానికి చెందిన మేకల కవిత రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అండర్‌పాస్‌ కోసం గతంలో ధర్నా సూరారం క్రాస్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మించాలని కోరుతూ...