Monday, November 9, 2026
Homeతెలంగాణకట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, పక్కా ఇల్లు

కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, పక్కా ఇల్లు

📰 Generate e-Paper Clip

  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ నేతల ధర్నా

హుస్నాబాద్, నవంబర్ 7 (చైతన్యగళం): కోహెడ గ్రామానికి చెందిన బీజేపీ మొదటి వార్డు సభ్యుడు కట్ట ప్రవీణ్‌కు చెందిన ఎస్టీ ఎరుకలి కుటుంబం నివాసాన్ని కూల్చివేసిన ఘటనపై బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, రెండు గుంటల స్థలం కేటాయించి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ధర్నా స్థలానికి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని నాయకులు పట్టుబట్టారు.

దీంతో మంత్రి క్యాంపు కార్యాలయంలో బీజేపీ ప్రతినిధులతో సమావేశానికి అవకాశం కల్పించారు. అనంతరం బీజేపీ నాయకులు మంత్రిని కలిసి కట్ట ప్రవీణ్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుతం ఆ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. బాధిత కుటుంబానికి తక్షణమే రెండు గుంటల స్థలం కేటాయించి, పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

బీజేపీ నాయకుల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కట్ట ప్రవీణ్‌కు చెందిన ఎస్టీ ఎరుకలి కుటుంబానికి రెండు గుంటల స్థలం కేటాయించడంతో పాటు పక్కా ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన మంత్రికి బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఖమ్మం వెంకటేశం, మాచర్ల కుమారస్వామి, పైడిపల్లి పృథ్వీరాజ్, జాలిగం రమేష్, బుక్యా సంపత్ నాయక్, పోలోజు సంపత్, శ్రీరామోజు శ్రీనివాస్, మంతుర్తి శ్రీకాంత్, దొడ్డి శ్రీనివాస్, గుగులోత్ తిరుపతి నాయక్, నునవత్ మోహన్ నాయక్, తోట స్వరూప, గొల్లపల్లి వీరాచారి, పున్నం శ్రీనివాస్, అచ్చ రవీందర్, మెడబోయిన స్వరూప, మ్యాకాల రజినీకాంత్‌రెడ్డి, జనగామ వేణుగోపాల్‌రావు, తోట సమ్మయ్య, కుంట స్వప్న, పేర్యాల సాగర్‌రావు, కర్ణకంటి నరేష్, పకీడే సంపత్, కొండబత్తిని సతీష్, తగురం లక్ష్మణ్, మడక రవికుమార్, అశోక్, తిరుపతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!