Sunday, November 8, 2026
Homeతెలంగాణఎస్టీ కమిషన్ ఏర్పాటుపై గిరిజన నాయకుల సంబరాలు

ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై గిరిజన నాయకుల సంబరాలు

📰 Generate e-Paper Clip

  • గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • కమిషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్

సైదాపూర్, నవంబర్ 7 (చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడంపై గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైదాపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేలా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎస్టీ కమిషన్ ఏర్పాటు గిరిజన సమాజానికి ఎంతో మేలు చేసే నిర్ణయమని, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఈ కమిషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, విద్య, వైద్యం, ఉద్యోగాలు, భూమి సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఎస్టీ కమిషన్ బలమైన వేదికగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

గిరిజనుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులోనూ గిరిజనుల సంక్షేమం కోసం మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వానోత్ కిషన్ నాయక్, సర్పంచ్ శంకర్ నాయక్, రవి నాయక్, రాము నాయక్, తిరుపతి నాయక్, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!