హుస్నాబాద్, నవంబర్ 7 (చైతన్యగళం): హుస్నాబాద్ పట్టణంలోని మరకత శివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి లింగాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని వేడుకున్నారు.
