- మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ సంతాపం
హుస్నాబాద్, నవంబర్ 7 (చైతన్యగళం): హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గొల్లగుంట గ్రామానికి చెందిన టీజీ 24 న్యూస్ ఛానల్ రిపోర్టర్ కాశవేణి రవీందర్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుగా ప్రజలకు, సమాజానికి సమాచారాన్ని చేరవేస్తూ వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసిన రవీందర్ చిన్న వయసులోనే మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మరణం జర్నలిజం రంగానికి, గొల్లగుంట గ్రామ ప్రజలకు, కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి వృత్తిలో కొనసాగుతున్న రవీందర్ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సతీష్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో రవీందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
