Sunday, November 1, 2026
Homeతెలంగాణకరీంనగర్ఎల్కతుర్తి మండలంలో బీజేపీ బూత్‌ కమిటీల ఏర్పాటు

ఎల్కతుర్తి మండలంలో బీజేపీ బూత్‌ కమిటీల ఏర్పాటు

📰 Generate e-Paper Clip

  • ఏకగ్రీవంగా ఎన్నికైన బూత్‌ అధ్యక్షులు.. పలువురు బీజేపీలో చేరిక

ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం):

భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవపూర్‌, ఇంద్రనగర్‌, దండేపల్లి, ఎల్కతుర్తి గ్రామాల్లో బూత్‌ స్థాయి కమిటీల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎల్కతుర్తి గ్రామంలో 314వ బూత్‌ అధ్యక్షుడిగా గోడిశాల రాజు, 315వ బూత్‌ అధ్యక్షుడిగా అల్లి కిరణ్‌, 316వ బూత్‌ అధ్యక్షుడిగా గూడెల్లి దశరథం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అల్లి సురేష్‌, దూడ రమేష్‌, కందుకూరి శ్రీనివాస్‌, కడారి లింగయ్య తదితరులు బీజేపీలో చేరారు. వారికి మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌ యాదవ్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దండేపల్లి గ్రామంలో 289వ బూత్‌ అధ్యక్షుడిగా మాచర్ల వెంకటేష్‌, 290వ బూత్‌ అధ్యక్షుడిగా పనుగంటి లక్ష్మారెడ్డి, 291వ బూత్‌ అధ్యక్షుడిగా కడారి సంపత్‌రావు, 292వ బూత్‌ అధ్యక్షుడిగా కాటుకూరి కార్తీక్‌ ఎన్నికయ్యారు. ఇంద్రనగర్‌ గ్రామంలో తొలిసారిగా బీజేపీ బూత్‌ కమిటీని ఏర్పాటు చేయగా, 319వ బూత్‌ అధ్యక్షుడిగా నమిండ్ల ప్రవీణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశవపూర్‌ గ్రామంలో 320వ బూత్‌ అధ్యక్షుడిగా ఈర కుమారస్వామి, 321వ బూత్‌ అధ్యక్షుడిగా పుట్ట కనకయ్య, 322వ బూత్‌ అధ్యక్షుడిగా గన్నోజు రాకేష్‌ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌ యాదవ్‌ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో బూత్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రతి బూత్‌ను పార్టీకి బలమైన పునాదిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన బూత్‌ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపి, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకితభావంతో సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో మండల ప్రధాన కార్యదర్శులు అల్లి కుమార్‌, చిదురల వెంకటేష్‌, ఉపాధ్యక్షులు కడారి ప్రసాద్‌, వేల్పుల శ్రీనివాస్‌, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు పోలు నరేష్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!