ఎల్కతుర్తి మండలంలో బీజేపీ బూత్‌ కమిటీల ఏర్పాటు

ఏకగ్రీవంగా ఎన్నికైన బూత్‌ అధ్యక్షులు.. పలువురు బీజేపీలో చేరిక ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని కేశవపూర్‌, ఇంద్రనగర్‌, దండేపల్లి, ఎల్కతుర్తి గ్రామాల్లో బూత్‌ స్థాయి కమిటీల ఏర్పాటు కార్యక్రమాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పలు బూత్‌లకు అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్కతుర్తి గ్రామంలో 314వ బూత్‌ అధ్యక్షుడిగా గోడిశాల రాజు, 315వ బూత్‌ అధ్యక్షుడిగా అల్లి కిరణ్‌, 316వ బూత్‌...