Wednesday, October 28, 2026
Homeతెలంగాణకరీంనగర్హుస్నాబాద్‌ ప్రాంతాన్ని కరువు జాబితాలో చేర్చాలి

హుస్నాబాద్‌ ప్రాంతాన్ని కరువు జాబితాలో చేర్చాలి

📰 Generate e-Paper Clip

  • అర్హత ఉన్న మండలాలకు న్యాయం చేయాలి: బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోట సమ్మయ్య

హుస్నాబాద్‌, అక్టోబరు 28 (చైతన్యగళం):

హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చాలని బీజేపీ కిసాన్‌ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు తోట సమ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కరువు మండలాల ఎంపికలో వర్షపాతం లోటు, పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల మట్టం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని సమ్మయ్య కోరారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కరువు ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అర్హత ఉన్న మండలాలను జాబితాలో చేర్చి రైతులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.

వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అవసరమైన సహాయాన్ని అందించడంతోపాటు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించి, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని తోట సమ్మయ్య హెచ్చరించారు. అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!