Sunday, October 25, 2026
Homeతెలంగాణకరీంనగర్అర్హతే ప్రామాణికం.. రాజకీయాలకు తావులేదు

అర్హతే ప్రామాణికం.. రాజకీయాలకు తావులేదు

📰 Generate e-Paper Clip

  • ఇందిరమ్మ ఇళ్లపై వచ్చిన ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్

అక్కన్నపేట, అక్టోబర్ 25 (చైతన్యగళం): కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ ఖండించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై వాస్తవాలను నిర్ధారించకుండా ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా బుర్ర ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావులేదని, ప్రభుత్వ నిబంధనలు, అర్హతల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వార్తలు ప్రచురించే ముందు సంబంధిత వాస్తవాలను పరిశీలించాలని ఆయన సూచించారు. ఆధారాలు లేని ప్రచారాల వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు సైతం పథకాల అమలుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బుర్ర ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!