అర్హతే ప్రామాణికం.. రాజకీయాలకు తావులేదు
ఇందిరమ్మ ఇళ్లపై వచ్చిన ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ అక్కన్నపేట, అక్టోబర్ 25 (చైతన్యగళం): కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ ఖండించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై వాస్తవాలను నిర్ధారించకుండా ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బుర్ర ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల...