Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌

బతుకమ్మ ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌

📰 Generate e-Paper Clip

  • హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువు వద్ద ఏర్పాట్ల పరిశీలన

హుస్నాబాద్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను హుస్నాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.

పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. బతుకమ్మ వేడుకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మున్సిపాలిటీ తరఫున ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

పండుగ రోజుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, బతుకమ్మ ఆడే ప్రదేశాలు, చెరువుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!