Thursday, October 15, 2026
Homeక్రైమ్ న్యూస్మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

  • రూ.18 వేల జరిమానా విధించిన సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం
  • కేసు దర్యాప్తు, విచారణలో సహకరించిన అధికారులను అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్‌

సిద్దిపేట, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.18 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. న్యాయస్థానం సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి చెందిన మైనర్‌ బాలికను బండి భాస్కర్‌ (27) ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకుని అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు 2022 ఏప్రిల్‌ 22న రాజగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి, రాజగోపాలపేట ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించారు. అనంతరం న్యాయస్థానంలో పటిష్ఠమైన అభియోగపత్రాన్ని దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది సాధుల ఆత్మరాములు వాదనలు వినిపించారు. ప్రస్తుత సిద్దిపేట రూరల్‌ సీఐ విద్యాసాగర్‌, ఎస్‌ఐ టి.వివేక్‌, సాక్ష్యాలను నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ వాసుదేవరావు, సమన్వయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సీడీఓ రవి, భరోసా ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ బి.దుర్గ, భరోసా న్యాయాధికారి సౌమ్య, భరోసా సిబ్బంది కేసు విచారణలో సమన్వయంతో సహకరించారు.

సమర్పించిన ఆధారాలను పరిశీలించిన సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి వై.జయప్రసాద్‌ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.18 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మి పెరుమాళ్‌ అభినందించారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, నేరస్థులకు చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!