Sunday, October 11, 2026
Homeతెలంగాణకరీంనగర్పూల పండుగతో పులకించిన గంగుల నివాసం

పూల పండుగతో పులకించిన గంగుల నివాసం

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 10 (చైతన్యగళం):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పూలను దైవస్వరూపంగా భావించి ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ వేడుకలతో గంగుల నివాసం పండుగ శోభను సంతరించుకుంది.

వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఇంటి వాకిట్లో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజిత, కుటుంబ సభ్యులు శారద, గీత, సునీతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!