- అంగన్వాడీ సిబ్బందికి సన్మానం.. చిన్నారులకు అరటిపండ్ల పంపిణీ
ఎల్కతుర్తి, అక్టోబరు 6 (చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా దామెర గ్రామంలో ‘అంగన్ మిలాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్‌యాదవ్ అధ్యక్షతన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సన్మానించారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, బాలల అభివృద్ధిపై సిబ్బందితో చర్చించారు.
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చీదురాల వెంకటేష్, కార్యదర్శి చిర్ర శ్రీనివాస్, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముషీకే వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీవర్ధన్, కూడుతడి రాజు, ఠాకూర్ శామ్‌సింగ్, ఎడ్ల రగోతంరెడ్డి, మద్దె అనిల్, గొర్రె ప్రవీణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నాంపల్లి మమత, రమ తదితరులు పాల్గొన్నారు.
