Thursday, October 1, 2026
Homeతెలంగాణఅర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

  • ఆరుట్ల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బుడిగల పరమేష్‌

మంచాల, అక్టోబరు 1 (చైతన్యగళం): త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆరుట్ల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బుడిగల పరమేష్‌ కోరారు. బుధవారం ఆరుట్లలో విలేకరులతో మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడిని ఎన్నుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.

2023లో డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, డిగ్రీ లేదా పట్టభద్రత ధ్రువపత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఫోన్‌ నంబరుతో తహసీల్దార్‌ కార్యాలయంలో ఫారం–18 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో ceotelangana.nic.in ద్వారా నవంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!