Tuesday, September 29, 2026
Homeతెలంగాణమర్రిగూడలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

మర్రిగూడలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

  • అర్హులందరికీ కార్డులు అందిస్తాం: తహసీల్దార్‌ శ్రీనివాసులు

మర్రిగూడ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!