మర్రిగూడలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

అర్హులందరికీ కార్డులు అందిస్తాం: తహసీల్దార్‌ శ్రీనివాసులు మర్రిగూడ, సెప్టెంబరు 29 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.