- కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: కేటీఆర్
కల్వకుర్తి, సెప్టెంబరు 29 (చైతన్యగళం): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావును బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో బాకీ కార్డుల కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారని కేటీఆర్ ఉప్పల వెంకటేష్‌ను అభినందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు.
