Tuesday, September 29, 2026
Homeతెలంగాణతరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలి – అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రకళ

తరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలి – అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రకళ

📰 Generate e-Paper Clip

వర్ధన్నపేట , సెప్టెంబర్ 29 (చైతన్యగళం): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద మంగళవారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రకళ ముఖ్యఅతిథిగా హాజరై వయోవృద్ధులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధులు కుటుంబానికి విలువైన మార్గదర్శకులని, వారి అనుభవాలు భావితరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పిల్లలు, యువత వయోవృద్ధులను గౌరవిస్తూ వారితో ఆత్మీయంగా మెలగాలని సూచించారు.
పిల్లలు, వయోవృద్ధుల మధ్య అనుబంధాన్ని పెంపొందించేలా ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. వయోవృద్ధులకు ప్రేమ, గౌరవం, భద్రత, అవసరమైన వైద్య సహాయం అందించడం ప్రతి కుటుంబ బాధ్యత అన్నారు. వయోవృద్ధులకు సహాయం లేదా సమాచారం అవసరమైతే 14567 టోల్‌ఫ్రీ నంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు.అనంతరం వయోవృద్ధుల సంక్షేమం, గౌరవప్రదమైన జీవనం, కుటుంబంలో ఆత్మీయ వాతావరణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అమరేందర్, అంగన్వాడీ టీచర్లు వజ్రమ్మ, బుజ్జమ్మ, ఆయా సుశీల, వయోవృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!