Wednesday, September 30, 2026
Homeతెలంగాణప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

  • మూడేళ్లు గడిచినా హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం: ఎల్ది మల్లయ్యగౌడ్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 28(చైతన్యగళం): ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ మానుకోట పట్టణ ఇన్‌చార్జి, వైస్‌ ఎంపీపీ ఎల్ది మల్లయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మల్లయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లికి తులం బంగారం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

హామీలను తక్షణమే అమలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు క్యాచువల్‌ శ్యాం శర్మ, రాష్ట్ర మైనారిటీ కౌన్సిల్‌ సభ్యురాలు రేష్మా, నాయకులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి దారావత్‌ రవినాయక్‌, సీనియర్‌ నాయకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!