ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

మూడేళ్లు గడిచినా హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం: ఎల్ది మల్లయ్యగౌడ్‌ మహబూబాబాద్‌, సెప్టెంబరు 28(చైతన్యగళం): ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ మానుకోట పట్టణ ఇన్‌చార్జి, వైస్‌ ఎంపీపీ ఎల్ది మల్లయ్యగౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లికి...