- గణనాథుడికి ప్రత్యేక పూజలు.. అన్నదానంలో పాల్గొన్న నాయకులు
వెల్దండ, సెప్టెంబరు 23 (చైతన్యగళం): వెల్దండ మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆమె ఆహ్వానం మేరకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. గణనాథుడిని పూజిస్తే విఘ్నాలు తొలగి శుభకార్యాలు విజయవంతంగా సాగుతాయని తెలిపారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర శీను, మాజీ సర్పంచ్ అరుణ–ప్రభాకర్, మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ నాగుల నాయక్, కానుగుల జోగయ్య, గ్రామ వార్డు సభ్యులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
