Saturday, September 19, 2026
Homeతెలంగాణఅర్హతలు లేకుండా బోన్ సెట్టింగ్.. ధన్వంతరి హాస్పిటల్ సీజ్

అర్హతలు లేకుండా బోన్ సెట్టింగ్.. ధన్వంతరి హాస్పిటల్ సీజ్

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్, సెప్టెంబర్ 18(చైతన్యగళం):

హుస్నాబాద్, సెప్టెంబర్ 18 (చైతన్య గళం): హుస్నాబాద్ పట్టణంలో సరైన విద్యార్హతలు, వైద్య అర్హతలు లేకుండా ధన్వంతరి హాస్పిటల్ పేరుతో బోన్‌ సెట్టింగ్‌ నిర్వహిస్తున్న అంకం శ్రీనివాస్‌పై మెడికల్ అధికారులు చర్యలు చేపట్టారు. హాస్పిటల్‌ను తనిఖీ చేసిన అధికారులు సీజ్ చేశారు.

ఈ మేరకు మెడికల్ అధికారి పొన్న శ్రీనివాస్ పిటిషన్ సమర్పించగా, అంకం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు హుస్నాబాద్ ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ తనిఖీలో ఎంఆర్‌ఓ లక్ష్మారెడ్డి, ఆర్‌ఐ, మున్సిపల్ ఎస్‌ఐ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!