హుస్నాబాద్, సెప్టెంబర్ 18(చైతన్యగళం):
హుస్నాబాద్, సెప్టెంబర్ 18 (చైతన్య గళం): హుస్నాబాద్ పట్టణంలో సరైన విద్యార్హతలు, వైద్య అర్హతలు లేకుండా ధన్వంతరి హాస్పిటల్ పేరుతో బోన్ సెట్టింగ్ నిర్వహిస్తున్న అంకం శ్రీనివాస్‌పై మెడికల్ అధికారులు చర్యలు చేపట్టారు. హాస్పిటల్‌ను తనిఖీ చేసిన అధికారులు సీజ్ చేశారు.
ఈ మేరకు మెడికల్ అధికారి పొన్న శ్రీనివాస్ పిటిషన్ సమర్పించగా, అంకం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు హుస్నాబాద్ ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ తనిఖీలో ఎంఆర్‌ఓ లక్ష్మారెడ్డి, ఆర్‌ఐ, మున్సిపల్ ఎస్‌ఐ తదితర అధికారులు పాల్గొన్నారు.
