- సొంత వ్యయంతో బోరు మోటార్ ఏర్పాటు
మంచాల, ఆగస్టు 27 (చైతన్యగళం): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని గంగమ్మ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి బీఆర్ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా బోరు మోటార్ ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్‌రెడ్డిని కోరగా, ఆయన వెంటనే స్పందించి రూ.లక్షకు పైగా సొంత ఖర్చుతో బోరు మోటార్‌ను ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్‌రెడ్డిని ఆలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అధ్యక్షుడు గుడ్డిమల్లి బుచ్చయ్య, కోశాధికారి నూకం కృష్ణ ముదిరాజ్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
అలాగే ఉపసర్పంచ్ నూకం విజయ్‌కుమార్ (రాజు), వార్డు సభ్యులు, బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యుడు పున్నం రాములను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శేఖర్, నాగేష్ స్వామి, మల్లేష్, తులసి, రాజుతో పాటు బీఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు బూస్పెల్లి నందకుమార్, మంగ, ఐలేష్, గోపాల్, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రాజ్, సాయి, శ్రీకాంత్, శ్రావణ్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
