Thursday, August 6, 2026
Homeతెలంగాణకరీంనగర్హిరోషిమా–నాగసాకి దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీ

హిరోషిమా–నాగసాకి దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీ

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్యగళం): హిరోషిమా–నాగసాకి దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో యుద్ధాలు ఉపయోగకరమా.. కాదా అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఎర్రంరాజు సింగమరాజు అధ్యక్షతన, ఉత్తూరి దుర్గాప్రసాద్ సహాధ్యక్షుడిగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మైదం శివకాంత్ పటేల్ మాట్లాడుతూ హిరోషిమా, నాగసాకి ఘటనలు యుద్ధాల వినాశకర పరిణామాలకు నిదర్శనమని, శాంతి, సామరస్యం, మానవత్వం, సేవా భావాలను ప్రతి విద్యార్థి అలవరచుకోవాలని సూచించారు. జోన్ చైర్మన్ ముక్కా శరత్ కృష్ణ శాంతియుత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.వ్యాసరచన పోటీలో విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల సిబ్బందికి బట్ట సంచులు పంపిణీ చేసి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో బట్టు వినోద్, మెతుకు కృష్ణ చైతన్య, ఐతా సూరజ్, కోలా అన్నారెడ్డి, క్లబ్ సభ్యులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!