హిరోషిమా–నాగసాకి దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీ

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్యగళం): హిరోషిమా–నాగసాకి దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో యుద్ధాలు ఉపయోగకరమా.. కాదా అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఎర్రంరాజు సింగమరాజు అధ్యక్షతన, ఉత్తూరి దుర్గాప్రసాద్ సహాధ్యక్షుడిగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మైదం శివకాంత్ పటేల్ మాట్లాడుతూ హిరోషిమా, నాగసాకి ఘటనలు యుద్ధాల వినాశకర పరిణామాలకు నిదర్శనమని, శాంతి, సామరస్యం, మానవత్వం, సేవా భావాలను ప్రతి విద్యార్థి అలవరచుకోవాలని సూచించారు. జోన్ చైర్మన్ ముక్కా శరత్ కృష్ణ శాంతియుత...