Thursday, August 6, 2026
Homeతెలంగాణకరీంనగర్కమిషనరేట్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

కమిషనరేట్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్, ఆగస్టు 6 (చైతన్య గళం): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి. వెంకటరమణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సి. వెంకటరమణ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి, అందించిన భావజాలం చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు జయశంకర్ సార్ అని పేర్కొంటూ, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అనిల్, వివిధ విభాగాల అధికారులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, పరిపాలనా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!