Saturday, November 28, 2026
Homeతెలంగాణఅనారోగ్యంతో చికిత్స పొందుతున్న వెంకటయ్యకు రూ.4 వేల ఆర్థిక సాయం

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వెంకటయ్యకు రూ.4 వేల ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

కల్వకుర్తి, నవంబర్ 27 (చైతన్యగళం):

వెల్జాల్ గ్రామపంచాయతీ పదో వార్డు సభ్యురాలు మాస్కా లక్ష్మమ్మ భర్త వెంకటయ్య మహబూబ్‌నగర్‌లోని సంకల్ప్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ సి.ఎల్. శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రికి వెళ్లి వెంకటయ్యను పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.4 వేల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తన బాధ్యతని తెలిపారు. వెంకటయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ మాజీ సభ్యుడు ముజీబ్ రెహ్మాన్, డిప్యూటీ సర్పంచ్ శివ, విజయలక్ష్మి, విజయ్ కుమార్, మూడో వార్డు సభ్యుడు వట్టెల శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!