- సంక్రాంతి తర్వాత పల్లెబాట పట్టి ప్రజల్లోకి వెళ్లాలి: కాంగ్రెస్ శ్రేణులకు ద్యాప నిఖిల్‌రెడ్డి పిలుపు
కల్వకుర్తి, నవంబర్ 23 (చైతన్యగళం):
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ద్యాప నిఖిల్‌రెడ్డి (డీఎన్‌ఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. “కోటి ఓట్లు సాధించడం, 90 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలు లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి” అని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ అనంతరం పల్లెబాట కార్యక్రమం చేపట్టి గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ద్యాప నిఖిల్‌రెడ్డి తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

