- రోడ్డు ప్రమాదంలో వీఏఓ మృతి పట్ల గోలి శ్రీనివాస్‌రెడ్డి దిగ్భ్రాంతి
ఆమనగల్లు, నవంబర్ 23 (చైతన్యగళం):
రామంతుల తండాకు చెందిన వీఏఓ తావుర్య నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తావుర్య నాయక్ మృతి విషయం తెలుసుకున్న ఆయన, పలువురు నాయకులతో కలిసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, సర్పంచ్ శ్రీను నాయక్, మాజీ సర్పంచులు ఆనంద్ నాయక్, శ్రీరాములు, పోలేపల్లి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ చందు నాయక్, ఆమనగల్లు మాజీ మార్కెట్ డైరెక్టర్ శుభాష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తావుర్య నాయక్ అకాల మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. కష్టకాలంలో వారికి మనోధైర్యం కల్పిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తావుర్య నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

