Thursday, November 19, 2026
Homeతెలంగాణప్రజల విజ్ఞప్తికి స్పందించి కేశవ నగర్ కాలనీలో వెలుగులు నింపిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ప్రజల విజ్ఞప్తికి స్పందించి కేశవ నగర్ కాలనీలో వెలుగులు నింపిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • సొంత నిధులతో హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు.. కాలనీవాసుల హర్షం

కల్వకుర్తి, నవంబర్‌ 15 (చైతన్యగళం):

ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తనవంతు సహకారం అందించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, టాస్క్‌ (TASK) సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు. ప్రజల విజ్ఞప్తికి స్పందించి కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కేశవ నగర్‌ కాలనీలో సొంత నిధులతో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేయించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.

కేశవ నగర్‌ కాలనీలో రాత్రివేళల్లో సరైన వెలుతురు లేక స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాలనీవాసులు సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సొంత నిధులతో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీలో రాత్రివేళల్లో రాకపోకలకు సౌకర్యం కలగడంతోపాటు మహిళలు, వృద్ధులు, స్థానికులకు భద్రతాపరంగా కూడా ప్రయోజనం చేకూరనుంది.

ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే కేవలం పెద్ద పనులు చేపట్టడమే కాదని, ప్రజల నిత్యజీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం కూడా నిజమైన అభివృద్ధిలో భాగమని అన్నారు. ప్రతి కాలనీ, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని, ప్రజల అవసరాలకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు తన సహకారం ఎల్లప్పుడూ కొనసాగిస్తానని తెలిపారు.

హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు పట్ల కేశవ నగర్‌ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను తెలియజేసిన వెంటనే స్పందించి సొంత నిధులతో లైట్లు ఏర్పాటు చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వినడమే కాకుండా, వాటి పరిష్కారానికి స్వయంగా ముందుకొచ్చి సహకరించడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యను గుర్తించడం బాధ్యత అయితే, దానికి ఆచరణలో పరిష్కారం చూపించడం నిజమైన ప్రజాసేవ అని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్‌ రామకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నరేష్‌ చారి, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, వరప్రసాద్‌, రామకృష్ణ, రాఘవాచారి, కె. రాములు, బి. రాములు, సత్యనారాయణ, విశ్వనాథం, అనంత రాములు, చెన్నయ్య, నరసింహ, బాలు, రామ్మోహన్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, ఎన్‌. శ్రీనివాస్‌, రాంరెడ్డి శేఖర్‌, ప్రవీణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!