మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్‌కు బీజేపీ నేతల వినతి.. వీధి దీపాలు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై ఫిర్యాదు మహబూబాబాద్, నవంబర్ 2 (చైతన్యగళం): మానుకోట మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ పట్టణ ఇన్‌చార్జి, వైస్ ఎంపీపీ ఎల్ది మల్లయ్య గౌడ్ డిమాండ్ చేశారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌కు పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లయ్య గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట వీధి...