400 మీటర్ల పరుగులో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జి. రిశ్వంత్ ఎంపిక హుస్నాబాద్, అక్టోబర్ 31 (చైతన్యగళం): ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థి జి. రిశ్వంత్ ప్రతిభ చాటాడు. 400 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. సిద్దిపేట జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల ఉమ్మడి స్థాయిలో 14, 17 ఏళ్ల బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో...