Tuesday, November 17, 2026
Homeతెలంగాణకరీంనగర్మాజీ చైర్మన్‌ సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మాజీ చైర్మన్‌ సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

📰 Generate e-Paper Clip

బెల్లంపల్లి, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): బెల్లంపల్లి మాజీ చైర్మన్‌ సూరిబాబు సోదరుడు చంద్రశేఖర్‌ ఇటీవల మృతి చెందడంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రశేఖర్‌ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, వారి కుటుంబాలకు కష్టసుఖాల్లో అండగా నిలవడం తన బాధ్యత అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!