మాజీ చైర్మన్‌ సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బెల్లంపల్లి, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): బెల్లంపల్లి మాజీ చైర్మన్‌ సూరిబాబు సోదరుడు చంద్రశేఖర్‌ ఇటీవల మృతి చెందడంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రశేఖర్‌ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, వారి కుటుంబాలకు కష్టసుఖాల్లో అండగా నిలవడం తన బాధ్యత అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి...