నందికొట్కూరు, అక్టోబర్ 24 (చైతన్యగళం):
నందికొట్కూరు పట్టణంలోని 11వ వార్డులో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ ఫాతిమా బీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ ప్రచారంలో ముందుకు సాగారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ ప్రచారంలో షేక్ సమీన, అంజుమ్, కమృనిష, సుమయ్య, సఫా, హజీరా, రమణమ్మ, మల్లేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు.
