Monday, October 19, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

  • కుటుంబ సమేతంగా పాల్గొన్న మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ దంపతులు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపంగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్‌ నగరంలో కన్నులపండువగా సాగాయి. నగరంలోని తీగలగుట్టపల్లిలో ఉన్న అమ్మవారి ఆలయం వద్ద నగరపాలక సంస్థ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్‌ దంపతులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మను పేర్చి అమ్మవారి ఆలయం వద్ద ఉంచారు. అనంతరం మహిళలతో కలిసి సంప్రదాయ ఉయ్యాల పాటలు, బతుకమ్మ పాటలు పాడుతూ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. దీంతో ఆలయ ప్రాంగణంలో పండుగ సందడి నెలకొంది.

వేడుకల అనంతరం స్థానిక ప్రజలు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్‌ నగర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని గౌరమ్మను ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!