కరీంనగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కుటుంబ సమేతంగా పాల్గొన్న మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ దంపతులు కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపంగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్‌ నగరంలో కన్నులపండువగా సాగాయి. నగరంలోని తీగలగుట్టపల్లిలో ఉన్న అమ్మవారి ఆలయం వద్ద నగరపాలక సంస్థ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ దంపతులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మను పేర్చి అమ్మవారి ఆలయం వద్ద ఉంచారు. అనంతరం మహిళలతో...